Ticker

6/recent/ticker-posts

Dear Earth



ప్రియమైన భూమి
ఈ సుదూరమైన విశ్వం నుండి చూస్తే, భూమికి ఏ ప్రత్యేకమైన  ప్రాముఖ్యత ఉన్నట్లు అనిపించకపోవచ్చు కాని మనకు ఇది పూర్తిగా భిన్నమైనది.  ఇక్కడ ఉన్న ఆ చుక్కను మళ్ళీ పరిశీలిస్తే, అదే మనం నివసించే ఇల్లు, అది మన సర్వస్వం. దీనిపై మీరు ప్రేమించే వారు, మీకు తెలిసిన వారు, ఇంకా మీరు ఎప్పుడు వినని మరియు చూడని వారు కూడా వారి జీవితాలను గడుపుతున్నారు. ఇక్కడ వేల మతాలు, వివిధ భావజాలాలూ వివిధ ఆర్థిక సిద్ధాంతాలు.
      ఒక వేటగాడు మరియు దోపిడీదారుడు, ఒక  హీరో మరియు పిరికివాడు, ఒక రాజు మరియు రైతు,  ప్రేమలో ఉన్న ప్రతి యువ జంట, ప్రతి తల్లి మరియు తండ్రి, వారి బిడ్డలు, ఆవిష్కర్త మరియు అన్వేషకుడు, ప్రతి  గురువు, ఎందరో అవినీతి రాజకీయ నాయకులు, ఇలా సూపర్ స్టార్, దగ్గర్నుండి సాధువు  వరకు ఇక్కడే సూర్యరశ్మి నుండి వెలువడే కాంతి ని ఆసరాగా చేసుకొని జీవిస్తున్నారు. 

     ఇప్పటివరకు మనం జీవించడానికి తెలిసిన ఏకైక ప్రపంచం భూమి.  సమీప భవిష్యత్తులో మన జాతులు వలస వెళ్ళే ప్రదేశం మరెక్కడా లేదు, Visit చేయడానికి అయితే ఉంది కానీ స్థిరపడడానికి ఇంకా రాలేదు. సో మనకు ఇష్టం ఉన్నా లేకున్నా మనం ఈ భూమి మీద బతకాలి చివరికి ఇందులోనే కలవాలి. 
  అలాంటి భూమి నీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మన కోసం ఇంకా మన భవిస్యత్ కోసం. ఎందుకంటే అది మనకు తెలిసిన ఏకైక ఇల్లు కనుక.

Post a Comment

0 Comments